AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉక్రెయిన్ లో భారీ డ్యామ్ కూల్చివేత..

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నిరవధికంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్లోని కాఖోవ్కా హైడ్రో ఎలెక్ట్రిక్ డ్యామ్ తునాతునకలైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ డ్యామ్ తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దక్షిణ ఉక్రెయిన్ లోని డెనిప్రో నదిపై నిర్మించబడిన ఈ కాఖోవ్కా డ్యామ్ ప్రధానంగా క్రైమే పెనిన్సులా, న్యూక్లియర్ ప్లాంట్ కు నీటిని సరఫరా చేస్తుంటుంది. ఈ ఒక్క డ్యామ్ కూలిన కారణంగా కిందన ఉన్న అనేక పట్టణాల్లో వరద ప్రమాదం పొంచి ఉంది అని అధికారులు తెలిపారు. ఆయా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

డ్యామ్ కూల్చివేతపై రష్యా బలగాలు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యాపైనే ఆరోపణలు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ మిలిటరీ.. స్థానిక ఉక్రెయిన్ గవర్నర్ ఇద్దరూ జలవిద్యుత్ ప్లాంట్‌లో పేలుడు సంభవించినప్పుడు ఖెర్సన్ నగరంలోని ప్రజలను తరలించాలని సూచనలు చేశారు. ఉక్రెయిన్ నేషనల్ పోలీస్-స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఖేర్సన్ మరియు 10 గ్రామాలతో సహా డ్నీపర్ నది యొక్క కుడి ఒడ్డున ఉన్న వరద మండలాల్లోని పౌరులను ఖాళీ చేస్తున్నాయని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ANN TOP 10