AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హ్యాపీ బర్త్‌డే బావ’.. మంత్రి హరీష్‌కు ఎమ్మెల్సీ కవిత స్పెషల్ విషెస్

తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు హరీష్ రావుకు జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా.. మంత్రి హరీష్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌డే బావ అంటూ ఆమె ఆప్యాయంగా విష్ చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. కవిత షేర్ చేసిన ఫోటోను పలువురు రిట్వీట్ చేస్తున్నారు.

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా హరీష్ రావుకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ ప్రత్యేకమైన రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాంగగా మెుక్కలు నాటాలని సూచించారు. పర్యావరణహితం కోసం చేపట్టిన ఈ చిన్ని కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ఆయన అభిమానులు, అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ‘హ్యాపీ బర్త్‌డే హరీషన్న’ అనే ట్యాగ్‌లైన్ ట్రెండింగ్‌లో ఉంది.

ANN TOP 10