AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నటి అలియాభట్‌ ఇంట విషాదం..

ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. అలియాభట్‌ తాత నరేంద్రనాథ్‌ రాజ్‌దాన్‌ (95) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అస్వస్థతకు లోనైన నరేంద్రనాథ్‌ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తుండగా.. ఇవాళ తుది శ్వాస విడిచారు. నటి సోని రాజ్‌దాన్‌ (డైరెక్టర్‌ మహేశ్ భట్ సతీమణి) ఈ విషయాన్ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు. తన తండ్రి త్రోబ్యాక్ స్టిల్‌ను పోస్ట్‌ చేసి.. ఈ విషాదకర వార్తను అందరితో పంచుకుంటూ.. సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

ANN TOP 10