AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ ఆఫీస్‌లో రాహుల్‌గాంధీ, కంది శ్రీనన్న


సిలికాన్‌ వ్యాలీ, కాలిఫోర్నియా, శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత ఇన్నోవేటివ్‌ సెంటర్‌ ‘‘ప్లగ్‌ అండ్‌ ప్లే’’ ఆఫీస్‌ కార్యాలయాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి సందర్శించారు.

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాసరెడ్డి.. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో పాల్గొంటున్న విషయం విదితమే. కాలిఫోర్నియా, శాన్‌ ఫ్రాన్సిస్కో లో అతిపెద్ద సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఓనర్‌ అయిన తన బెస్ట్‌ ఫ్రెండ్‌ కుటుంబాన్ని రాహుల్‌ కు కంది శ్రీనివాసరెడ్డి పరిచయం చేశారు. వారిని రాహుల్‌ గాంధీ ఆప్యాయంగా పలకరించారు.

రాహుల్‌ టీం ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాసరెడ్డి పర్యటనలో పాల్గొంటున్నారు. ఎన్‌ఐఆర్‌లతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ నెల 9 వరకు రాహుల్‌ పర్యటనలలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌కు ఎన్‌ఆర్‌ఐల మద్దతు వెల్లువెత్తుతోంది.

ANN TOP 10