AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కీర్తి ఎల్లలు దాటాలి..


దశాబ్ధి ఉత్సవాలు ధూంధాంగా నిర్వహించాలి
కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ధూంధాంగా నిర్వహించాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకూడదని తెలిపిన కేసీఆర్.. ఉత్సవాల నిర్వహణ కోసం 105 కోట్లు విడుదల చేశారు. అయితే.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై.. సచివాలయంలో మంత్రులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో.. దశాబ్ది ఉత్సవాలపై ఉన్నతాధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దశాబ్ది వేడుకలు పండుగలా జరపాలని సూచించారు. అరవయ్యేళ్ల పాటు సాగిన పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా అభివృద్ధి చెందినట్టు తెలిపారు. అయితే.. రాష్ట్రం అవతరించి పదేళ్లు అవుతున్న సందర్భంగా.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంతో పాటు అమరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ కీర్తిని చాటి చెప్పేలా.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరగాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గ్రామల నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను ధూంధాంగా నిర్వహించి.. విజయవంతం చేయాలని సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10