AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తా

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తనను నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద ఎంపీ పార్టీ కార్యకర్తల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 26న ముఖ్యనాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10