ముంబై: బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డ ప్రమాదంలో మృతి చెందారు.బుధవారం ఉదయం నార్త్ ఇండియాలో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించినట్లు బాలీవుడ్ ప్రడ్యూసర్ జెడి మజేథియా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేస్తూ.. ‘జీవితం చాలా అనూహ్యమైనది. ఒక మంచి నటి, ఫ్రెండ్, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ లో జాస్మిన్ గా పాపులర్ అయిన వైభవి ఉపాధ్యాయ మరణించారు. ఆమె నార్త్ లో కారు ప్రమాదానికి గురయ్యారు. అంత్యక్రియల కోసం ఆమె భౌతికకాయాన్ని కుబుంబ సభ్యులు రేపు ముంబైకి తీసుకువస్తారు. రిప్ వైభవి’ అని పేర్కొన్నారు.
కాగా, 32 ఏళ్ల వైభవి ఉపాధ్యాయ… జెడి మజేథియా నిర్మించిన పాపులర్ టీవి షో సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ లో జాస్మిన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, దీపికా పడుకొనేతో కలిసి చపాక్, టైమిర్ లలో వైభవి ఉపాధ్యాయ నటించింది.