AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చూపులా.. చురకత్తులా


దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు మీరా జాస్మిన్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో రన్ అనే సినిమాతో కథానాయికగా పరిచయమైంది మీరా జాస్మిన్. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది.

పెళ్లి తర్వాత నటనకు దూరమైన మీరాజాస్మిన్.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ మరోసారి ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది మీరా జాస్మిన్. ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో నయనతార సైతం నటిస్తుంది.తన హాట్‌ ఫిగర్‌తో ఫొటో షూట్‌లు చేస్తూ సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. తాజాగా ఈమె పిక్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10