AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిట్టి బుర్రలో ఎంత పెద్ద ఆలోచనో..!

చిన్నారి ఇన్నొవేషన్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా
ఇన్నొవేషన్‌కు వయసుతో సబంధం లేదని నిరూపిస్తూ.. ఈ చిన్నారి చేసిన ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. ఈ చిన్నారి తమ ఫేవరెట్ ఇన్నోవేటర్ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారంటే.. ఆ చిట్టి బుర్ర ఎంతో పెద్ద ఆలోచన చేసిందో చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కీర్తి అనే విద్యార్థిని.. ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.. మనం సాధారణంగా.. సరుకులు తీసుకొచ్చేందుకు ఒక సంచి తీసుకెళ్తాం. అందులోనే.. వేరు వేరు రకాల వస్తువులన్నింటినీ ఒకే దాంట్లో వేసుకుని తీసుకొస్తుంటాం. అలాంటి సమయంలో.. చాలా వస్తువులు డ్యామేజ్ అవ్వటమో.. కవర్లు తిరిగిపోయి ఒకదాంట్లో ఒకటి కలిసిపోవటం లాంటివి జరుగుతుంటాయి. అయితే.. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కరం చూపుతూ.. మన సిరిసిల్ల కీర్తి.. ఓ మల్టీపర్పస్ అగ్రికల్చర్ బ్యాగ్ తయారు చేసింది.

ఈ మల్టీపర్పస్ అగ్రికల్చర్ బ్యాగ్‌లో వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు, ఉత్పత్తులు, మిగతా వస్తువులు.. ఇలా అన్నింటినీ ఒకేసారి తీసుకెళ్లొచ్చు. వీటన్నింటి కోసం ఆ బ్యాగ్‌లో వేరువేరు గదులను ఏర్పాటు చేసింది చిన్నారి కీర్తి. వీటన్నింటితో పాటు.. మొబైల్ ఫోన్ పెట్టుకునేందుకు కూడా ఓ చిన్న ప్యాకెట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సంచిని తయారు చేసేందుకు.. ప్రత్యేకంగా వేరే ఏమీ వాడకుండా.. వాడిపాడేసిన బియ్యపు సంచిని ఉపయోగించుకోవటం గమనార్హం. ఇలాంటి సంచి.. వ్యవసాయ దారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది కీర్తి. ఈ సంచిలో ఒకేసారి రకరకాల వస్తువులు, ఉత్పత్తులను కలిసిపోకుండా తీసుకెళ్లొచ్చని వివరిస్తుంది. ఈ చిన్నారి చిట్టి బుర్రలో మెదిలిన గొప్ప ఆలోచనకు కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు.

ANN TOP 10