కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీకి చెందిన 39 ఏళ్ల అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్ వైరల్ అయ్యింది. కర్ణాటకలోని విజయనగరలో.. 90వ నంబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థి.. తనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. శంకర్ దాసర్ (39) కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్నారు. ఇదివరకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇదే విధంగా తెలిపారు. ఈ అంశం ఇప్పుడు వైరల్ అయ్యింది.









