AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాళ్లతో రొమాన్స్‌ చేయడం ఇష్టం: నటి కుష్బూ

చిరంజీవి, బాలకృష్ణ.. ఇప్పటికీ ఈ హీరోలకు ఉన్న క్రేజ్‌ మామూలిది కాదు. వాళ్ల డైలాగ్‌ డెలివరీ, డాన్స్‌, గ్రేస్‌, యాక్టింగ్‌ కు వీరాభిమానులున్నారు. ఈ హీరోలకోసం అప్పటి యువతులే కాదు.. హీరోయిన్లు కూడా పిడి చచ్చిపోయేవాళ్లు. ఈ ఇద్దరి పక్కన కాంబినేషన్‌ కోసం డైరెక్టర్ల చుట్టు తిరిగేవాళ్లు. అలాంటి హాట్‌ న్యూస్‌ అలనాటి నటి కుష్బూ సుందర్‌ ఒకటి బయటి పెట్టింది. తన క్రష్‌ హీరో లిస్ట్‌ ను బయటిపెట్టింది. తనకు చిరంజీవి, బాలకృష్ణతో రొమాన్స్‌ చేయడం అంటే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ ప్రమోషన్‌ ప్రెస్మీట్‌ లో ఈ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది కుష్బూ. తను మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణతో రొమాన్స్‌ చేయడానికి ఇష్టపడతానని, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ తన డ్రీమ్‌ హీరో అంటూ వివరించారు. ఇప్పటికీ తన దగ్గర అమితాబ్‌ బచ్చన్‌ పోస్టర్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కాగా.. వారసుడు సినిమాలో తన 18 నిమిషాల సీన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది కుష్బూ.

ANN TOP 10