తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు తెరపైకొస్తున్నాయి. దాంతో పార్టీ శ్రేణులు, చిన్న స్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెద్దపల్లిలో భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరోవైపు నల్గొండ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని స్థానిక ఎంపీలు వాయిదా వేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై పార్టీలో చర్చ మొదలైంది.









