AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై భట్టి సంచలన ఆదేశాలు..!

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించేలా వేగం పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగ పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా నిధుల వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు, నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సామాజిక , ఆర్థిక సాధికారత కోసం కేటాయించిన నిధుల వినియోగంలో ఎలాంటి జాప్యం జరగకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన కేటాయించిన ఈ సబ్‌ప్లాన్ నిధులు ఆయా వర్గాల అభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగపడేలా ప్రతి శాఖ పటిష్టమైన వ్యయ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. చట్ట నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులకు లోబడి సాధారణ పద్దుల తరహాలోనే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పద్దుల కింద నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నిధుల ఖర్చులో ఉన్న అంతరాలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కేటాయించిన బడ్జెట్ నిర్దేశిత లక్ష్యాలకు చేరేలా సంబంధిత శాఖలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆర్థిక శాఖలో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదాయ వనరుల సమీకరణ పెంచడంతో పాటు, రుణాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథక అమలుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సవాళ్లు ఎదురుకాకుండా ముందస్తు వ్యూహంతో ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశార

ANN TOP 10