AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభమైన డాక్‌ఫిట్ ప్రీమియర్ లీగ్..! డాక్టర్ల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా గ్రావిటీ ఫార్మా వినూత్న కార్యక్రమం..

కరీంనగర్: నిత్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే వైద్యుల శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ గ్రావిటీ ఫార్మా కంపెనీ ( Graviti pharma Company ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న DocFit (డాక్‌ఫిట్) ప్రీమియర్ లీగ్ కరీంనగర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. వైద్యులు తమ వృత్తిపరమైన విధుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై కూడా దృష్టి సారించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గతంలో వరంగల్‌లో నిర్వహించిన డాక్‌ఫిట్ ప్రీమియర్ లీగ్‌కు విశేష స్పందన లభించడంతో, ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తరిస్తూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లోని VJR మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈరోజు క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించారు.

ఈ లీగ్‌లో కరీంనగర్‌కు చెందిన పలువురు వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం నాలుగు జట్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. సాధారణంగా 24/7 ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ, రోగుల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమయ్యే వైద్యులు.. ఆట మైదానంలో మాత్రం క్రీడాకారులుగా మారి ఉల్లాసంగా గడిపారు. క్రికెట్ ఆడుతూ తమలోని క్రీడాస్ఫూర్తిని చాటడంతో పాటు, శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

వైద్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన గ్రావిటీ ఫార్మా కంపెనీని ఈ సందర్భంగా పాల్గొన్న వైద్యులు అభినందించారు. వృత్తిపరమైన ఒత్తిళ్ల మధ్య వైద్యులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు డాక్‌ఫిట్ ప్రీమియర్ లీగ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరీంనగర్ వైద్యులకు డాక్‌ఫిట్ ప్రీమియర్ లీగ్, గ్రావిటీ ఫార్మా కంపెనీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందిస్తూ, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో భవిష్యత్తులోనూ ఈ లీగ్‌ను మరిన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.

ANN TOP 10