AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వేడి మొదలైందా..?ఉత్తరాంధ్ర నేతలతో జగన్ ప్రత్యేక సమావేశం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వేడి మొదలైందా? అధికార-విపక్షాలు నేతలు-కేడర్‌ని అలర్ట్ చేస్తున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారా? కీలక నేతలు పార్టీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారా? సీనియర్లు పార్టీ నుంచి వెళ్లకుండా ఉండేందుకు కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీ నుంచి కీలక నుంచి డ్రాప్ కావడంతో అధినేత జగన్ కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఉన్న నేతలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మీ సీటు సేఫ్ అంటూ కీలక నేతలకు అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం.. తాడేపల్లిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ అధినేత జగన్‌తో రెండుగంటల పాటు సమావేశమయ్యారు. తాజా రాజకీయాల గురించి చర్చించుకున్నారు.

ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని, ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో రెండు గంటల పాటు సాగిన భేటీలో జిల్లాలో వైసీపీ బలోపేతంపై జగన్‌తో చర్చించారు తమ్మినేని. ప్రస్తుతం శ్రీకాకుళం వైసీపీ పార్లమెంటరీ పార్టీ  ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు తమ్మినేని. పార్లమెంట్రీ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి‌గా తమ్మినేని దాదాపు జగన్ ఖరారు చేసినట్టు సమాచారం.

యువజన విభాగం నేతగా తమ్మినేని కొడుకు చిరంజీవి.. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, లక్ష్యాలను యువతలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచన చేశారట. భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. భూకబ్జా విషయంలో కేసులు నమోదు తర్వాత తమ్మినేని ఫ్యామిలీ సైలెంట్ అయపోయింది.

రెండోవైపు వద్దాం. ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్లు మిగతా పార్టీల వైపు చూస్తున్నారంటూ వేగుల ద్వారా అధినేత జగన్‌కు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన జగన్, బుధవారం బొత్స, తమ్మినేనిలను పిలిపించి మాట్లాడారు. ఇదే మయంలో తమ్మినేని సీతారాం కొడుకు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైనా జగన్ చర్చించారట. నార్మల్‌గా అయితే ఆ విధంగా మాట్లాడిన వాళ్లను అధినేత దగ్గరకు రానిచ్చే సందర్భాలు ఉండవు. పిలిపించి మరీ శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్ నీకే అని తమ్మినేని సీతారాంకు హామీ ఇచ్చారు. బొత్సకు కూడా చీపురుపల్లి సీటు ధాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. పార్టీలో ఎప్పటిమాదిరిగా మీ పని కంటిన్యూ చేసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.

స్థానిక సంస్థలకు ముందు ఈ విధంగా హామీలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని అనుకుంటున్నారు కొందరు నేతలు. గురువారం నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీ నియోజకవర్గాల నేతలు, కో-ఆర్డినేటర్లతో భేటీ అయ్యారు అధినేత జగన్. ఇందులో ఆయా నేతలకు ఎలాంటి సంకేతాలు ఇస్తారో చూడాలి.

ANN TOP 10