నేపాల్లో భారీ వరదలతో ఎఫెక్ట్‌తో బీహార్ అతలాకుతలం అవుతుంది. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా బీహార్ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలు మోత్తం జలమయం అయ్యాయి. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీహార్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం సామ్రాట్ చౌదరి ఏరియల్ సర్వే నిర్వహించారు.
నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నటువంటి బగాహా, వాల్మీకినగర్, బెట్టియా, మోతీహరి వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వరద తీవ్రతను హెలికాప్టర్ ద్వారా సీఎం సామ్రాట్ చౌదరి పర్యటించారు. అక్కడి ప్రాంతాల పరిస్థితులను తెలుసుకున్నారు. నేపాల్, జార్ఖండ్ లలో కురుస్తున్న వర్షాల వల్ల గండక్, గంగ, సోన్ వంటి ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ సమీప గ్రామాలను ముంచెత్తుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి తక్షణ సహాయక మరియు రెస్క్యూ చర్యలు చేపట్టాలన్న సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. తగినన్ని నిత్యావసరాలు అందేలా రిలీఫ్ క్యాంపులను పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వరదల కారణంగా బీహార్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భరోసా ఇచ్చింది.







