టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి వచ్చే ఏడాది జూన్ 11వ తేదీ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు కూడా అధికారకంగా వెల్లడించారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదం కారణంగా సర్జరీ అవ్వడంతో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.
ఇలా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అనుకున్న విధంగానే ఈ సినిమా జూన్ 11వ తేదీ విడుదల అవుతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులు సినిమా విషయంలో ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మైత్రి మూవీ నిర్మాతలు ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. అనుకున్న విధంగానే వచ్చే ఏడాది జూన్ నెలలో డ్రాగన్ విడుదల అవుతుందని విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇక ఎన్టీఆర్ మరొక రెండు వారాలలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని, ఇప్పటికే పూర్తి అయిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలిపారు.
ఇలా ఎన్టీఆర్ మరొక రెండు వారాలలో షూటింగ్లో పాల్గొనబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు సంతోషపడ్డారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ భాగం కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు దాదాపు నిజమేనని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం డ్రాగన్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు షాహిద్ కపూర్ కీలక పాత్రలలో కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన చివరిగా దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రం వార్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్ని కూడా డ్రాగన్ సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.








