AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..

మంత్రి నారా లోకేష్ చొరవతో మాస్కో-విశాఖ మద్య స్మార్ట్ సిటీ ఒప్పందం జరిగింది. ఈ ఓప్పందంలో భాగంగా విశాఖపట్నం నగర రవాణా ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వం–మాస్కో ప్రభుత్వాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ రవాణా సదస్సులో జీవీఎంసీ, మాస్కో ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఇరు నాయకులు సంతకాలు చేశారు.

 ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఏఐ ఆధారిత రవాణా, డిజిటల్ టికెటింగ్, స్మార్ట్ మొబిలిటీపై పరస్పర సహకారం అందించనున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ గతంలో రష్యా పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం కుదిరిందని అధికారుల పేర్కోన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి రవాణా నమూనాలను విశాఖలో అమలు చేసే దిశగా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల మార్పిడి చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజదానికోపం విశాఖను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా, భవిష్యత్‌కు అనుగుణమైన టెక్నాలజీ ఆధారిత నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక ఆడుగువేస్తుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు. దేశంలో ఓ గోప్పనగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఈ ఓప్పందంతో రానున్న రోజుల్లో టెక్నాలజీ పరంగా అభివృద్దికి మరో అడుగు ముందుకువేసిన వారిగా ఉంటామని మంత్రి నారాలోకేష్ తెలిపారు.

ANN TOP 10