నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నా.. వరుస యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా అఖండ 2 సినిమాలో ఎటువంటి డూప్ లేకుండా మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ కనబరిచి, అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన.. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఆయన వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)ఎంట్రీకి మాత్రం మోక్షం కలగలేదని చెప్పాలి. గత 3,4 సంవత్సరాలుగా అదిగో మోక్షజ్ఞ వస్తున్నాడు.. ఇదిగో మోక్షజ్ఞ వస్తున్నాడు అంటూ కామెంట్లతో సరిపెట్టేస్తున్నారే తప్ప ఇప్పటివరకు ఆయన సినిమా పట్టాలెక్కిన దాఖలాలు లేవు.
మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?
ముఖ్యంగా ప్రశాంత్ వర్మ (Prashanth varma), క్రిష్ (Krisha) ఇలా ఎంతోమంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ అసలు మోక్షజ్ఞ సినిమాను ఎవరు టేకప్ చేశారు అనే విషయంపై ఎక్కడా స్పష్టత రాకపోవడం నందమూరి అభిమానులను రోజురోజుకీ నిరాశలో ముంచేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో సడన్గా అభిమానులకు కొత్త ఊపిరి పోస్తూ రంగంలోకి దిగడానికి సిద్ధం అయిపోయింది బాలకృష్ణ వారసురాలు తేజస్విని (Tejaswini Nandamuri) . ప్రముఖ ఆహా ఓటిటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో తో హోస్ట్ గా తన తండ్రి బాలకృష్ణకి మంచి గుర్తింపును అందించడమే కాకుండా.. దేశంలోనే నెంబర్ వన్ టి ఆర్ పి అందుకున్న షోగా తీర్చిదిద్దిన ఘనత తేజస్వినికే సొంతం. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. అటు డాన్స్ విషయంలో కూడా అదరగొట్టేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన నృత్య రీతులతో సోషల్ మీడియా వేదికగా మెస్మరైజ్ చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు వెండితెర అరంగేట్రానికి సిద్ధం అయిపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన తేజస్విని..
ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక స్పోర్ట్స్ డ్రామా కథలో తేజస్విని కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఒక సందేశాత్మక చిత్రంగా మలిచేందుకు సన్నహాలు సిద్ధం చేస్తున్నారట. మొత్తానికైతే తేజస్విని ఇప్పుడు వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు అనే వార్త నందమూరి అభిమానులలో అంచనాలను భారీగా పెంచేసింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.
అభిమానుల కోరిక తీర్చుతూ..
తేజస్విని ఈ మధ్యకాలంలో ఎక్కువగా డాన్స్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్లు, ప్రకటనలలో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది . ఆమె స్క్రీన్ ప్రజెంట్స్ చూసిన అభిమానులు కూడా తేజస్విని సినిమాల్లోకి రావాలి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తేజస్విని నిజంగానే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే తండ్రిలాగే తేజస్విని కూడా నటిగా సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.








