బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో నటించిన నటి పాలక్ తివారీ సల్మాన్ ఖాన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సల్మాన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన సెట్లో అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలని రూల్ పెట్టారు. డీప్ నెక్‌లు ఉండే డ్రస్సులు అసలు వేసుకోవద్దు. సల్మాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం ఏమిటంటే.. ఆయన సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సేఫ్‌గా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఇక సల్మాన్‌తో షూటింగ్ అనగానే నా చెల్లి చాలా సంతోషపడేది అంటూ అమె చెప్పుకొచ్చింది.









