AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

భోగాపురం ఎయిర్ పోర్టు గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆగష్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యార్థులకు ఒక్కటే చెబుతున్నానని, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలన్నారు. మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయని తనదైన శైలిలో చమత్కరించారు ముఖ్యమంత్రి.

 

రంప చోడవరంలో సీఎం చంద్రబాబు- శుక్రవారం రంప చోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఐదు-పదేళు కష్టపడితే, జీవితంగా శాశ్వతంగా సుఖపడతారన్నారు. ఫలితంగా తల్లిదండ్రులు గర్వపడతారని చెప్పారు.

 

భోగాపురం ఎయిర్‌పోర్టు అదొక గేమ్ ఛేంజర్- మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయని విద్యార్థులను ఉద్దేశించి చమత్కరించారు. విద్యార్థులు మీకు మార్కులు వేస్తే.. ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తానని అన్నారు. ఎందుకంటే లోకేష్ ఏరి కోరి తీసుకున్న శాఖని, ఆ రోజు ఈ శాఖను ఎందుకు అడిగారో ఇవాళ తనకు అర్థమైందన్నారు.

 

ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు- రాను రాను ప్రభుత్వ పాఠశాలలు బలహీనమవుతున్నాయని, అందులో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. రెండేళ్లులో లక్షా 10 వేల మంది విద్యార్థులు.. ప్రైవేటు పాఠశాలల నుంచి మారి ప్రభుత్వం పాఠశాలలకు వచ్చారని వివరించారు. విద్యార్థులు వస్తామంటే ప్రైవేటు పాఠశాలలు టీసీలు ఇవ్వకుండా అడ్డు పడే పరిస్థితికి వచ్చిందంటే అది ప్రభుత్వ పాఠశాలల సత్తా అని తెలియజేశారు.

 

76 ఏళ్ల వయసులో పడుకునే సమయం తప్ప, ప్రతి క్షణం పనిచేస్తున్నానని తెలిపారు. తాను నిన్నటి ఆలోచనను కాదని, భవిష్యత్తు విజన్‌ అని గుర్తు చేశారు. భవిష్యత్తులో పిల్లలు ఆస్తి అని, పిల్లలు పుడితే భారం కాదన్నారు. ఆదాయంగా మార్చేశామని అన్నారు ముఖ్యమంత్. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని, అందుకోసం రూ.10,120 కోట్లు జమ చేసినట్టు వివరించారు.

 

ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5లక్షల మందికి రూ.664 కోట్లు వారి ఖాతాల్లో వేశామన్నారు. పిల్లలు సమాజానికి ఉపయోగపడాలని, విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. విద్యా వ్యవస్థకు వెన్ను ముక ఉపాధ్యాయులని, సమాజంలో టీచర్లకు మంచి గుర్తింపు ఉందన్నారు. శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేస్తున్నామని, పిల్లలు ఆనందంగా ఉంటే బాగా చదువుతారని గుర్తు చేశారు.

ANN TOP 10