AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేందిచోచ్..! ఎప్పుడంటే..?

2026 ఆరంభంలోనే మారుతి దర్శకత్వంలో తన కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ది రాజాసాబ్ సినిమా చేసి భారీ స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్.. ఇప్పుడు మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీతారామం సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులకి ఫౌజీ సినిమా యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

 

ఫౌజీ రిలీజ్ డేట్ లాక్..

ఈ మేరకు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యుద్ధభూమిలో రక్తపు మడుగుల్లో శవాలుగా మారిన శత్రువుల నడుమ పంచె కట్టుకొని.. రక్తంతో నిండిపోయిన బేర్ బాడీతో చేతిలో తుపాకీ పట్టుకొని కూర్చున్న ఒక ఫోటోని మేకర్స్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 3వ తేదీన ఫౌజీ విడుదల కానున్నట్లు తెలుపుతూ పంచుకున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సీతారామం వంటి ప్రేమ కథలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న హను రాఘవపూడి ఈసారి పాన్ ఇండియన్ పీరియడ్ యాక్షన్ వార్ డ్రామా తో వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

వెండితెర అరంగేట్రం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్..

ఇకపోతే ఈ సినిమా ద్వారా తొలిసారి ప్రభాస్ సరసన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లోయెన్సర్ ఇమాన్వి ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. వ్యక్తిగతంగా ఎంతో టాలెంట్ ఉన్న ఈమె ఇప్పుడు ఏకంగా తన మొదటి సినిమానే ప్రభాస్ తో ఛాన్స్ అందుకోవడంతో ఈమెపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి దర్శకుడి ప్రయత్నానికి ఇమాన్వి ఎలాంటి న్యాయం చేకూరుస్తుందో చూడాలి. ఇక ఈమె తోపాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది.

 

ఏడాది ఆరంభంలో నిరాశపరిచిన ప్రభాస్.. సక్సెస్ అందిస్తారా?

ఇకపోతే ఈ ఏడాది ఆరంభంలో ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్.. ఇప్పుడు డిసెంబర్ 3వ తేదీన ఏడాది ఆఖరిలో ఫౌజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందించనున్నారు అనే అనుమానాలు ఆడియన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని టి సిరీస్ , మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1940 లలో బ్రిటిష్ రాజ్, ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మరి ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

 

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

 

ప్రభాస్ మరొకవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు విభిన్న పాత్రలతో విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ తన ఉనికిని గ్లోబల్ స్థాయికి విస్తరించుకుంటున్నారు.

ANN TOP 10