AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్దం.. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపేలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రైళు పట్టాలలు కోయండి, మిలిటెడ్ ఉద్యమాలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయంమే.. అందుకుగాను పోలీసులు బాల్కసుమన్ పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్దం చేసారు.

 

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

దీంతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కార్యాలయానికి వచ్చారన్న సమాచారంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ భవన్‌లోకి వెల్లేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్కసున్ పై నాన్ బేయిల్ కింద కేసు నమోదైంది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా నోటిసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆబిడ్స్ ఏసీపీ బీఆర్ఎస్ న్యాయవాదులకు తెలిపారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ ఆస్థులను ద్వంసం చేసేలా మాట్లాడారని పలువురు రాజకీయ నాయకులు ఫైర్ అయ్యారు.

ANN TOP 10