AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినిమా స్క్రిప్ట్‌ను మించిన పాస్టర్ ‘దాడి’ డ్రామా.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాడి వీడియోల వెనుక ఉన్న అసలు రంగును పోలీసులు బయటపెట్టారు. ఇదంతా పక్కా స్కెచ్‌తో ఆడిన నాటకమని నిర్ధారించిన పోలీసులు, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పాస్టర్ అభినయ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.

 

కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై పాడేరులో దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పాస్టర్ అభినయ్ తన అనుచరులతో కలిసి ఈ దాడి డ్రామాను చిత్రీకరించినట్టు ఆధారాలతో సహా దొరికిపోయాడు.

 

ఈ కుట్రకు సంబంధించి నిందితుల మధ్య నడిచిన ఆడియో మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ చాట్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభించాయి. అభినయ్‌తో పాటు మరో ఆరుగురు కలిసి ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తేలింది. అసలు ఇంత పెద్ద దాడి డ్రామా వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10