గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం 4.05 గంటలకు ముంబయి వేదికగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా జాతర ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్‌చరణ్ మేకోవర్, ఆయన నటన, డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు ఎంత ఎమోషనల్‌గా తెరకెక్కించారో ట్రైలర్ స్పష్టం చేస్తోంది. చరణ్ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదగడం గమనించొచ్చు. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్ ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
రామ్‌చరణ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు…’’ ఈ డైలాగ్ సినిమాలోని చరణ్ క్యారెక్టర్ తీవ్రతను, పోరాటాన్ని తెలియజేస్తోంది. ‘‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను’’ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.
మొత్తంగా ‘పెద్ది’ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్న పక్కా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మెటీరియల్‌లా ఇది కనిపిస్తోంది. జూన్ 4న థియేటర్లలో చరణ్ బాక్సాఫీస్ వేట ఎలా ఉండబోతుందోచూడాలి!
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తు
న్నారు.







