AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తబోతున్న రామ్..!

అసలే వరుస అట్టర్ ప్లాపులు ..అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానంటూ ఈసారి స్వయంగా మెగా ఫోన్ పట్టేస్తున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.అసలే మార్కెట్ అంతంత మాత్రం.సరిగ్గా ఈ టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా ‘డైరెక్టర్’ అవతారం ఎత్తడం ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

 

తన డ్రీమ్ ప్రాజెక్టును తానే డైరెక్ట్ చేస్తానంటూ

 

అసలే గతేడాది విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 20 కోట్ల వసూళ్లతో డిజాస్టర్‌గా నిలవగా, పూరి జగన్నాథ్ లాంటి దిగ్గజాలే రామ్‌ను కాపాడలేకపోయారు. ఇలాంటి సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్టును తానే డైరెక్ట్ చేస్తానంటూ ముందుకు రావడం ఒక రకంగా పెద్ద రిస్కే అని చెప్పాలి. ‘ద వారియర్’ (2022), ‘స్కంద’ (2023) వంటి చిత్రాలు రామ్ కెరీర్‌ను ఇప్పటికే మార్కెట్ ని మొత్తంగా ముంచేయగా ఈ కొత్త అవతారం కెరీర్ ని ఏం చేస్తుందోనన్న భయం రాపో ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.

 

రేపు (మే 15న) అనౌన్స్ కానున్న సినిమా

 

ఇక ఈ సినిమాకు ‘ఖైదీ’, ‘విక్రమ్ వేద’ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సామ్ సీఎస్ సంగీత దర్శకత్వం వహించబోతున్నాడట.అయితే కేవలం సామ్ సీఎస్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే సినిమాను గట్టెక్కిస్తుందనుకోవడం రామ్ అమాయకత్వమే . అయితే టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ వంటి వారు డైరెక్షన్ చేసి సక్సెస్ అయినప్పటికీ రామ్ లాంటి కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోకి దర్శకత్వం ఎంత వరకు సూట్ అవుతుందనేది అనుమానమే. ఒక పక్క మార్కెట్ వాల్యూ దారుణంగా పడిపోతుంటే, మరోపక్క రైటర్, డైరెక్టర్, హీరో అంటూ మల్టీ టాలెంట్స్ ప్రదర్శించడం అంటే ఉన్నఆ కాస్త ఇమేజ్ ని కూడా పోగొట్టుకోవడానికే అంటూ నెట్టింట ట్రోల్స్ వినిపిస్తున్నాయ్. ఇక ఈ సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టాలని, ఈక్రమంలోనే రేపు అంటే మే 15న అనౌన్స్ చేయాలని భావిస్తున్నా, అసలు నిర్మాతలెవరు ముందుకు వస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లాగే కనిపిస్తుంది.

 

అవన్నీ డైరెక్టర్స్ టాలెంట్ వల్లే

 

ఇక గతంలో ఇలాగే చాలామంది హీరోలు డైరెక్టర్లుగా మారి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎందరో.ముఖ్యంగా హీరోగా వరుసగా మూడు నాలుగు డిజాస్టర్లు ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం అంటే కత్తి మీద సామనే చెప్పాలి. రామ్ తన కెరీర్‌లో ‘దేవదాసు’, ‘రెడీ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్లు అందుకున్నప్పటికీ, అవన్నీ డైరెక్టర్స్ టాలెంట్ వల్లే.ఇప్పుడు తన స్వంత తెలివితేటలతో సినిమా కనుక తీసి మళ్ళీ ‘స్కంద’ రేంజ్ ఫలితాన్నే రిపీట్ చేస్తే మాత్రం రామ్ కెరీర్ క్లోజ్ అయినట్టే.

 

రాపో ఎలాంటి ఫలితాన్ని ఫేస్ చేస్తాడో

 

నిజానికి సామ్ సీఎస్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కావొచ్చు, కానీ సినిమా సాలిడ్ గా ఉండాలంటే స్క్రీన్ ప్లే పక్కాగా ఉండాలి. మరి రామ్ ఆ స్థాయిలో కథను నడిపించగలడా? లేక తనలోని ఎనర్జీని కేవలం దర్శకత్వం పేరుతో వేస్ట్ చేస్తాడా? అనేది రేపు ఉదయం రాబోయే అఫీషియల్ పోస్టర్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇక రాపో ఫ్యాన్స్ ‘డైరెక్టర్ రామ్’ అంటూ హడావిడి చేస్తున్నా, టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ మాత్రం ‘ఆలోచించి అడుగులు వేయు గురూ’ అంటూ ముందుగానే హింట్ ఇస్తున్నారు. చూడాలి మరి నాకు నేను సక్సెస్ ఇచ్చుకుంటా అంటూ బరిలోకి దిగుతున్న రాపో ఎలాంటి ఫలితాన్ని ఫేస్ చేస్తాడో

ANN TOP 10