AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఠాగూర్’ సినిమా చేజారడం బాధించింది: రాజశేఖర్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై యాంగ్రీ హీరో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ సినిమా రాజశేఖర్ చేయాల్సిందట. తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ చిత్రం చూడగానే, ఆ కథ రాజశేఖర్‌ కు బాగా నచ్చింది. ఆ రీమేక్ హక్కులను తానే సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నించారట.

 

 

కొన్ని రాజకీయ, వ్యాపార కారణాల వల్ల ఆ కథ చిరంజీవి, నిర్మాత మధు వద్దకు వెళ్ళింది. చివరకు వినాయక్ దర్శకత్వంలో అది ‘ఠాగూర్’గా మారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ… “ఆ సినిమా నేను చేసి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. అవకాశం చేజారడం అప్పట్లో బాధ కలిగించినా, చిరంజీవి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు” అని భావోద్వేగానికి లోనయ్యారు.

ANN TOP 10