AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నితిన్ కొత్త ప్రాజెక్ట్.. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో నితిన్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా భీష్మ సినిమా తర్వాత సరైన విజయం లేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో సెట్స్ పైకి రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సోము, నర్రి అనే ఇద్దరు కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు అప్పుడే..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కొత్త సినిమాను మే 4వ తేదీన లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. మే ఆరవ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ ప్లాన్ షెడ్యూల్ తో కేవలం 55 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నారట. అంటే రెండు నెలల లోపే షూటింగ్ అంతా పూర్తయిపోతుంది.. అటు నితిన్ కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాజెక్టుగా నిలవనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్గా మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం.. ఇకపోతే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రితికాకు ఇది నితిన్ తో తొలి మూవీ అని చెప్పవచ్చు .

 

ఈ సినిమా నైనా నితిన్ కి సక్సెస్ అందిస్తుందా?

ఇకపోతే ఈ సినిమాకి విరాటపర్వం మూవీకి సంగీతాన్ని అందించిన సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కి ఈ డెబ్యూ డైరెక్టర్ ద్వయం హిట్ ఇస్తారో లేదో చూడాలి. ఇక నితిన్ విషయానికి వస్తే ఈయన తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ పంపిణీదారుడుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. నిజామాబాద్ కి చెందిన నితిన్ తెలంగాణ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది మంది సెలబ్రిటీలలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో అరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన గ్రాఫ్ అమాంతం చేసుకున్నారు.

 

సక్సెస్ కోసం నితిన్ ఆరాటం..

ఇకపోతే ప్రతి ఏడాది కూడా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కానీ భీష్మ రేంజ్ లో ఈయనకు సరైన సక్సెస్ లభించలేదని చెప్పాలి. అలా చెక్, రంగ్ దే , మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు , రాబిన్ హుడ్ ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. కానీ ఏ సినిమా కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించకపోవడం గమనార్హం. మరి ఇప్పుడు ఈ సినిమా నైనా నితిన్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి

ANN TOP 10