AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“మహావతార్ పరుశురామ్” మరో క్రేజీ ప్రాజెక్ట్..! పోస్టర్ కే గూస్ బంప్స్..!

ఇటీవల కాలంలో యానిమేటెడ్ సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోంభలే నిర్మాణ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా యానిమేషన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో ప్రాజెక్టును ప్రకటించారు ఇందులో భాగంగా ‘మహావతార్ పరుశురామ్'(Mahavatar Parshuraam) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

 

విష్ణుమూర్తి ఆరవ అవతారమే..

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “ధర్మం పతనమైనప్పుడు పరుశు గొడ్డలి లేస్తుంది”అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేసిన పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ లోకంలో అధర్మాన్ని రూపుమాపడం కోసం విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలలో ఆరవ అవతారమే పరశురాముడి అవతారం. ఇలా పరశురాముడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

 

2027 డిసెంబర్లో మహావతార్ పరుశురామ్ రిలీజ్..

ఇటీవల కాలంలో ఈ విధమైనటువంటి పౌరాణిక కథలను చూడటానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తున్న సంగతి తెలిసిందే. మహావతార్ నరసింహ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పరుశురామ్ కథ ఆధారంగా మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ పట్ల పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

సినీ ఇండస్ట్రీలో హోంభలే నిర్మాణ సంస్థ ఎన్నో అద్భుతమైన విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఇప్పటికే కేజిఎఫ్, సలార్ వంటి యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా కాంతారా, మహావతార నరసింహ వంటి ఆధ్యాత్మిక సినిమాలను కూడా నిర్మిస్తూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది. మహావతార్ నరసింహ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. మరి మహావతార్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న పరశురాం సినిమా ఎలా ఉండబోతుదనేది తెలియాల్సి ఉంది.

ANN TOP 10