AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోలీవుడ్ లో దూరంధర్ 2 హవా..! ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’ అంటూ రజినీ కితాబు..!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను “బాక్సాఫీస్ కా బాప్” (బాక్సాఫీస్‌కు తండ్రి లాంటివాడు) అంటూ కితాబివ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

సోమవారం రజనీకాంత్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. “‘ధురంధర్ 2’ అద్భుతమైన సినిమా. ఆదిత్య ధర్, బాక్సాఫీస్ కా బాప్. రణ్‌వీర్, చిత్ర బృందానికి అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా. జై హింద్” అని పోస్ట్ చేశారు.

 

రజనీకాంత్ ప్రశంసపై దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు. “సార్, మేమంతా వినోదానికి మిమ్మల్నే ఒక బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. దశాబ్దాలుగా మమ్మల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ, విజిల్స్ వేయించిన మీ మ్యాజిక్ ఇప్పటికీ కొనసాగుతోంది. అలాంటి మీరు మా సినిమాను ‘తప్పక చూడాలి’ అనడం నా జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్. మీ ఆశీర్వాదానికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు.

 

‘ధురంధర్ 2’ ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే, యాక్షన్, జాతీయవాదం వంటి అంశాలతో వచ్చిన ఈ చిత్రం.. ప్రభుత్వ అనుకూల ప్రచార సినిమా అంటూ ఒక వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.

ANN TOP 10