AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి నారా లోకేశ్‌పై నాగబాబు ప్రశంసలు: బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. మైలవరంలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో తలెత్తిన లోపానికి బాధ్యత వహిస్తూ మంత్రి క్షమాపణలు చెప్పడం ఆయనలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని నాగబాబు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాటుకు ఒక మంత్రిగా బాధ్యత స్వీకరించడం టీడీపీ నుంచి ఒక సమర్థవంతమైన నాయకుడు ఎదుగుతున్నారనే సంకేతాన్ని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మైలవరంలోని తారకరామ నగర్ ఎంపీ మోడల్ స్కూల్‌లో ‘దొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత లోపించినట్లు మంత్రి దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన లోకేశ్, ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి విచారణ జరిపించారు. కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత ఫుడ్ ఏజెన్సీని మార్చడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని హామీ ఇచ్చారు.

పాఠశాలల్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు లోకేశ్ హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ఇకపై నాణ్యతను పర్యవేక్షించేందుకు మరియు తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ‘లీప్’ (LEAP) యాప్‌ను వినియోగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ సంరక్షణ మరియు నాణ్యమైన ఆహారం అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా స్పందించే నేతలు ఉండటం రాష్ట్ర విద్యావ్యవస్థకు మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ANN TOP 10