AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా రోడ్డు ప్రమాదం: భారతీయ విద్యార్థిని ఆర్తి సింగ్ కోమాలో, తండ్రి ఒంటరి పోరాటం

అమెరికాలోని శాన్ జోస్‌లో ఈ నెల మొదట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ యువతి ఆర్తి సింగ్ తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోమాలోనే ఉంది. నవంబర్ 9వ తేదీన ఆర్తి సింగ్ వృత్తిపరమైన నెట్‌వర్కింగ్ ఈవెంట్ నుంచి తన ఇంటి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొట్టింది. అప్పటి నుంచి ఆమె అపస్మారక స్థితిలోనే ఉంది మరియు శాంటా క్లారా వ్యాలీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమెకు శ్వాస, ఆహారం కోసం వైద్యులు మెడ, కడుపు భాగాల్లో ముఖ్యమైన శస్త్రచికిత్సలు నిర్వహించారు.

సొంతవాళ్లు ఎవరూ లేని విదేశీ గడ్డపై, వైద్య మరియు చట్టపరమైన సవాళ్లతో ఒంటరిగా పోరాడుతున్న ఆర్తి తండ్రి సుమిరన్ సింగ్‌కు స్థానిక భారతీయ కమ్యూనిటీ మద్దతుగా నిలిచింది. కన్నీళ్లు పెట్టుకుంటూ సింగ్ మాట్లాడుతూ, “నా కూతురు ఇంకా కళ్లు తెరవడం లేదు. నేను ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె వింటుందని ఆశిస్తున్నాను. నాకు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె కళ్లు తెరవాలనే ఆశ ఒక్కటే నాకు ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన ‘హిట్ అండ్ రన్’ కాదని శాన్ జోస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అయితే, డ్రైవర్ గుర్తింపును మాత్రం పోలీసులు వెల్లడించలేదు. డ్రైవర్‌కు 50 ఏళ్ల వయసు ఉంటుందని, ప్రమాదం జరిగినప్పుడు అతడికి బీమా లేదని మాత్రమే తనకు సమాచారం అందిందని సుమిరన్ సింగ్ తెలిపారు. పోలీసులు డ్రైవర్ పరిస్థితి లేదా అతనిపై నమోదయ్యే అభియోగాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఆర్తి కుటుంబం న్యాయం కోసం నిరీక్షిస్తూ నిరాశ చెందుతోంది.

ANN TOP 10