AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘K-ర్యాంప్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండ షాకింగ్ కామెంట్స్: ‘హిట్ సినిమాని తొక్కేందుకు చూస్తున్నారు’

కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘K-ర్యాంప్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే రూ. 17.5 కోట్ల వసూళ్లను అందుకుని, అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్’లో నిర్మాత రాజేష్ దండ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమా వసూళ్లను ఓ వెబ్‌సైట్ ‘డ్యూడ్’ చిత్రంతో పోల్చుతూ తప్పుడు వార్తలు రాసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడిని ఉద్దేశిస్తూ పరుష పదజాలం ఉపయోగించారు, హిట్ సినిమాను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.

నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ.. తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినా ఒక వెబ్‌సైట్ ఇంకా ఏడుస్తూనే ఉందని ఆరోపించారు. అమెరికాలో ఉన్న ఆ వెబ్‌సైట్ వ్యక్తికి వార్నింగ్ ఇస్తూ, ‘డ్యూడ్’ సినిమాకు 190K, తమ సినిమాకు 46K అని కలెక్షన్స్ వేస్తున్నాడని, అయితే ‘డ్యూడ్’ వసూళ్లు తెలుగు, తమిళం కలిపి అని విమర్శించారు. ఒక హిట్టు సినిమాని తొక్కేయాలని ఇలాంటి ఆర్టికల్స్ వేస్తున్నాడని, ‘వీడ్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు వేదికపై ఎక్కువ మంది సపోర్ట్ చేసినప్పటికీ, బూతు పదాలు ఉపయోగించకుండా ఉండాల్సిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

రాజేష్ దండ గతంలోనూ సినిమా విడుదలైన తర్వాత నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్‌లో చిన్న సినిమాల పట్ల పక్షపాతం చూపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రేటింగ్స్ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లదని స్వాగతిస్తానని, కానీ చిన్న నిర్మాత అని చూపిస్తున్న పక్షపాతంపై తనకు బాధగా ఉందని అన్నారు. రివ్యూలు ఇచ్చేవాళ్లు ‘బాహుబలి’నైనా, ‘K-ర్యాంప్’ సినిమానైనా ఒకేలా చూడాలని, ఈ పార్షియాలిటీ ఎందుకో అర్థం కావట్లేదని అప్పుడే ప్రశ్నించారు. ఇప్పుడు కలెక్షన్ల విషయంలో తప్పుడు పోలికలు చూపిస్తున్న ఒక వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ANN TOP 10