AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చివరకు తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల ఫోన్లను ట్యాప్ చేయించి వింటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

ఫోన్ ట్యాపింగ్ సాధారణమేనని ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి అన్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌ను సహజమని చెప్పిన ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో పాటు సొంత మంత్రుల ఫోన్‌లను కూడా ఆయన ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తమపై ఇలాగే నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆయన ఎవరెవరితో తిరిగారో ఆ పదహారు మంది పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో ఎక్కడెక్కడ ఉన్నావో అందరికీ తెలుసునని ఘాటుగా విమర్శించారు. చివరకు మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.

ANN TOP 10