శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలని డిమాండ్
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపాలని ఆ రెండు పార్టీలకు హితవు పలికారు.
బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టాలని ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా టికెట్ రేటును స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని, దీనిపై అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలను పొలిటికల్ పార్టీలు ఎంత సేపటికీ రాజకీయ కక్ష అని అంటున్నాయని గుర్తు చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కక్ష సాధింపు చర్య అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, మణిపూర్‌లో 90 మంది చనిపోయారని, అక్కడ లా ఆర్డర్ లేదన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని, తప్పొద్దనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ సునీల్‌దత్ తన కొడుకు సంజయ్ దత్ విషయంలో చేసిన తప్పును అంగీకరించారని, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్∙మత్యుంజయ యాగం చేయాలన్నారు. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలు యాదగిరిగుట్ట స్వామి ఉండిలో వేయాలన్నారు.