75 ఏళ్ల వయసులోనూ ఉర్రూతలు..
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తన జోష్‌ను ప్రదర్శించారు. ఎప్పుడూ మాటలతో అదరగొట్టే మల్లారెడ్డి, ఈసారి డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. తన మనవరాలి సంగీత్ ఫంక్షన్‌లో తనదైన శైలిలో బ్రేక్ డ్యాన్స్ వేశారు. 75 ఏళ్ల వయసులో ఆయన వేసిన డ్యాన్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27వ తేదీన జరగబోతోంది.
సంగీత్ కార్యక్రమంలో..
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ‘డీజే టిల్లు’ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. పాటకు తగిన కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని స్టెప్పులు వేశారు. సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ చేసేందుకు మల్లారెడ్డి వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారట.
గతంలోనూ డ్యాన్స్ జోరు..
గతంలోనూ మల్లారెడ్డి అనేకసార్లు డాన్స్ చేశారు. ఈసారి కూడా ఆయన డ్యాన్స్ చేయాల్సిందేనని బంధువులు, సన్నిహితులు పట్టుబట్టారు. ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆ వయసులో కూడా మల్లారెడ్డి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
Mallareddy Mass 🕺🔥@chmallareddyMLA @KTRBRS @BRSparty pic.twitter.com/BF9cR53OlY
— Sai 🧢 (@Vardhavelly) October 21, 2024









