హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. కూల్చివేతలపై సీఎం రేవంత్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం అని పేర్కొంది. చట్టబద్ధమైన అనుమతులుంటే భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. చెరువులకు దగ్గరుంటే కూల్చివేస్తారని ఫేక్ ప్రచారం జరుగుతోందని.. అనుమతులు ఉంటే కూల్చివేయం అని చెప్పింది. అనుమతులు ఉన్న భవనాలను కూల్చివేయబోమని సీఎం చెప్పారని… సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం అని వివరించింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను అస్థిరం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలు, నాలాలను కబ్జా చేసినవారికి ‘హైడ్రా’ ఒక భూతం లాంటిదన్నారు. వారి పట్ల ఒక హైడ్రా అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
All real estate ventures with legally valid permissions have nothing to fear. False news is being spread that HYDRAA will demolish structures near lakes, even those legally permitted by competent authorities. The Honorable Chief Minister of Telangana has categorically stated that… pic.twitter.com/tMCZ7xf7L1
— HYDRAA (@Comm_HYDRAA) October 20, 2024









