బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నంగునూరు, సిద్దిపేట ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు కష్టాల్లో ఉన్న ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందని.. భవిష్యత్తులో ఆదుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. కలలోనైనా అనుకున్నామా 24 గంటలు కరెంట్ వస్తుందని, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దూకుతాయని. కల్యాణలక్ష్మితో లక్షరూపాయలు వస్తాయని, రైతుబంధు, రైతుభీమా పథకాలు వస్తాయని అనుకున్నామా.. అని హరీశ్‌రావు అన్నారు. కలలోనైనా అనుకున్నామా కాళేశ్వరం కట్టుకొని కోటి ఎకరాల మాగాణిగా మార్చుకుంటామని తెలిపారు. ఎలాంటివి ఎన్నో అమలు చేస్తున్న గొప్ప మనిషి మన సీఎం కేసీఆర్ సార్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఇన్నీ అసాధ్యాలు సుసాధ్యం అయ్యాయంటే మన అల్లాద్ధీన్ దీపం లేదని, తెలంగాణకు సీఎం కేసీఆర్ అనే మహా దీపం అండగా ఉంది కాబట్టి అందరం చల్లగా ఉన్నామన్నారు.
గత ప్రభుత్వాలు పేద ప్రజల కళ్లల్లో నీళ్లు రప్పిస్తే.. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధమైన నీళ్లు తాగిస్తుందన్నారు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అదోగతి అంటూ హరీష్ రావు వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచింది.. ప్రజలకు పెంచిందన్నారు. బీజేపీ ఆదానీ ఆమ్ దానీ పెంచుతుంటే సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల ఆమ్ దానీ పెంచుతుందన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ అంటే B- బీదల పార్టీ, R-రైతుల పార్టీ, S-సామాన్య మధ్య తరగతి పార్టీ అంటే కొత్త అర్థం చెప్పారు మంత్రి హరీష్ రావు.
కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే బీజేపీ వాళ్లు పేదల వద్ద పన్నులు గుంజి అదానికి పెడుతున్నారని విమర్శించారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ యాశంగి కొనదు అందుకే రాష్ట్రంలో కొంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగీ లో 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందన్నారు.