AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం.. ఏ ఉద్యోగానికి ఎప్పుడు పరీక్ష.. పూర్తి షెడ్యూల్..!

అసెంబ్లీలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు.. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను సర్కార్ ప్రకటించింది. మంత్రి వర్గం నిర్ణయించిన జాబ్ క్యాలెండర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సభలో ప్రకటించారు. అయితే.. ఈ జాబ్ క్యాలెండర్‌లో ఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్.. ఎప్పుడు పరీక్ష అన్నది తెలియజేశారు. ఉద్యోగాల సంఖ్యను నోటిఫికేషన్‌లో పేర్కొంటామని తెలిపారు.

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. జాబ్ క్యాలెండర్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. అయితే.. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని ప్రకటించిన భట్టి విక్రమార్క.. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక టీజీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని.. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు.

గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నుంచి డిసెంబర్‌కు వాయిదా వేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు నిర్వహిస్తున్నందున.. పరీక్షా తేదీల మధ్య కావల్సినంత సమయం లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. యుపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యను నివారించడానికి పరీక్షలకు సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫీకేషన్ ఎప్పుడు పరీక్ష అంటే..
ఉద్యోగం నోటిఫికేషన్ ఎప్పుడు (నెల) పరీక్ష ఎప్పుడు (నెల)
డిగ్రీ లెక్చరర్స్ జూన్ 2025 సెప్టెంబర్ 2025
రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్స్ జూన్ 2025 సెప్టెంబర్ 2025
గ్రూప్ 2 మే 2025 అక్టోబర్ 2025
గ్రూప్ 3 జూలై 2025 నవంబర్ 2025
ఎగ్జిక్యూటివ్ పోస్టులు జూలై 2025 నవంబర్ 2025
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 2025 మే 2025
టెట్ ఏప్రిల్ 2025 జూన్ 2025
గ్రూప్ -1 మెయిన్స్ ఇష్యూడ్ జులై 2025
ఎస్ఐ ఏప్రిల్ 2025 ఆగష్టు 2025
కానిస్టేబుల్ ఫిబ్రవరి 2025 జూన్ 2025
గ్రూప్ -1 ఇష్యూడ్ అక్టోబర్ 2024
గ్రూప్ -2 ఇష్యూడ్ డిసెంబర్ 2024
గ్రూప్ -3 ఇష్యూడ్ నవంబర్ 2024
ఫార్మా పోస్టులు సెప్టెంబర్ 2024 నవంబర్ 2024
ఇంజనీర్స్ అక్టోబర్ 2024 జనవరి 2025
గెజిటెడ్ ఇంజినీర్స్ అక్టోబర్ 2024 జనవరి 2025
టెట్ నవంబర్ 2024 జనవరి 2025
గెజిటెడ్ ఆఫీసర్స్ జనవరి 2025 ఏప్రిల్ 2025
డీఎస్సీ ఫిబ్రవరి 2025 ఏప్రిల్ 2025

ANN TOP 10