AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కడియం శ్రీహరికి టికెట్‌ ఇప్పించిందే నేనే.. ఓడగొట్టేది కూడా నేనే : ఎర్రబెల్లి దయాకర్‌ రావు

బీఆర్ఎస్‌ను(BRS) వీడిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై(Kadiam Srihari) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు(Errabelli Dayakar Rao) ఫైర్‌ అయ్యారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించింది తనేనని, మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా నేనేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహ‌రికి ఏం త‌క్కువ చేయ‌లేదు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశాలు ఇచ్చింది పార్టీ.

ఆయన పదవులు రావడం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లి లాంటి పార్టీకి బిడ్డ కోసం తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికల్లో కడియం గెలుపునకు కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశ వాదులకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10