తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఈ క్యాలెండర్ అమలు అవుతుందని బోర్డు స్పష్టం చేసింది.
వచ్చే విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండగా.. 75 రోజులు సెలవులు వచ్చాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలు పూర్తైన విద్యార్ధులకు (2023-24) మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.









