AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్…. ఫొటోలు ఇవిగో!

ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు.

ఇక, నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి, అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.

ANN TOP 10