AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో భారీగా విమానాలు రద్దు.. కారణమిదే

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాలు రద్దు అయ్యాయి. పొగమంచు కారణంగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో దాదాపు 37 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా విపరీతంగా పొగ మంచు ఏర్పడింది. దీంతో శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ANN TOP 10