AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిజాంపేటలో తండ్రి కూతురిపై వీధి కుక్కల దాడి..

నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన మరువకముందే నిజాంపేటలో మరొక ఘటన చోటు చేసుకుంది. నిజాంపేటలో తండ్రీకూతురులపై వీధి కుక్క దాడి చేసింది. బండారి లేఅవుట్ కు చెందిన నరేష్ కుమార్ తన కూతురితో బయటకు వెళ్లగా కుక్క ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరేష్ కుమార్‌ కాలికి తీవ్ర గాయం కాగా ఐదేళ్ల కూతురికి గాయాలు అయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క లాక్కెళ్ళింది. తీవ్రగాయాలైన చిన్నారి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ హాస్పిటల్‌లో తండ్రి కూతుర్లకు చికిత్స అందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10