తెలంగాణ మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ తర్వాత తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇందులో భారత ప్రధాన మంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.









