AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డి ఆల్ టైమ్ బెస్ట్ సీఎం అవుతారు: రామ్ గోపాల్ వర్మ

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న రేవంత్ రెడ్డిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఎంతో జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారని ఆయన అన్నారు. రేవంత్ గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఆలోచనల్లో పదును గురించి తెలిసిన వ్యక్తిగా చెపుతున్నా… ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. నో డౌట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు సీఎంగా రేవంత్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ పార్టీ పెద్దలను కలుస్తూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.

ANN TOP 10