AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇస్రో గగన్‌యాన్‌ ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో.. గగన్‌యాన్ మిషన్‌ విజయవంతంగా ప్రారంభించింది. ఉదయం 10 గంటలకు.. తిరుపతి జిల్లా.. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం – షార్ (SHAR) నుంచి గగన్‌యాన్‌ తొలి దశ ప్రయోగం TV-D1ని విజయవంతంగా చేపట్టింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 TV-D1 రాకెట్.. షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్… క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగంలో రాకెట్.. తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచి పెట్టింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో షార్‌కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ దిగింది. అప్పటికే బంగాళాఖాతంలో రెడీగా ఉన్న నౌకా దళ సిబ్బంది.. క్రూ మాడ్యూల్‌ని స్వాధీనం చేసుకొని, ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా 8 నిమిషాల్లో ముగిసింది.

ANN TOP 10