AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో టీడీపీకి షాక్.. బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేత?

తెలంగాణలో ఎన్నికల వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనతో బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 లోగా ఆయన చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్ సమాచారం. బీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారంపై జరుగుతుండగా.. రావుల మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన అందబాటులో లేరని చెబుతున్నారు.

రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. వనపర్తి నుంచి 1994, 2009లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ముఖ్య నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీల్లో చేరారు. కానీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయనకు టీడీపీలో ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడి పదవి ఉంది. అంతేకాదు ఇప్పటికీ రావులకు వనపర్తి జిల్లాలో వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది అని చెబుతుంటారు.

ANN TOP 10