
కొందరు హీరోయిన్స్ రాత్రికి రాత్రే ఫేమ్ కొట్టేస్తుంటారు. ఈ రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరి అదృష్టం ఒక్కోలా ఉంటుంది. ఆ లిస్టులోనే ఉంటుంది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఇదిలాఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వైష్ణవి తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది. మరీ ముఖ్యంగా పెళ్లి, కాబోయేవాడి గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
కాబోయే భర్తపై తాను భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదని.. ఆస్తి పాస్తులు, అందచందమేమీ లేకపోయినా పరవాలేదు కానీ మంచి మనసు ఉంటే చాలు అని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే అంటూ మనసులో మాట బయటపెట్టింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ బేబీ క్రేజ్ పెంచేశాయి.










