హైదరాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం ప్రారంభం అయ్యింది. యూసఫ్ గూడ, బోరబండ, మోతినగర్, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ముషీరాబాద్, బాగ్ లింగంపల్లి, విద్యానగర్, రామ్ నగర్ లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.









